Allu Arjun :
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన స్నేహితుడు
నంధ్యాల వైయస్సార్‌సిపి పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధి శిల్పా రవీంధ్రను సపోర్టుచేస్తూ నంధ్యాల వెళ్లిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉండగా ఆ సమయంలో అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా
అక్కడికి వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిన కారణంగా పరిస్థితిని అదుపు చేయలేకపోవటంతో పోలీసులు కేసును నమోదు చేశారు.
అనుమతి లేకుండా జనసమీకరణ చేశారు అంటూ బన్నీపై కేసు నమోదు అయింది.
ఈ కేసును కొట్టేయాలని సోమవారం అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కోరారు.
దీనికి సంబంధించిన విచారణను మంగళవారం న్యాయస్థానం పరిశీలించనుంది.
చూడాలి ఏమౌతుందో అనుకుంటూ అటు తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Also Read This : సోషల్ మీడియా వ్యసనం మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది