పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్.. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. పుష్ప తర్వాత బన్నీ రేంజే మారిపోయింది. దీంతో ఇక మీదట చేసే సినిమాలు దానికి తగ్గట్టుగానే ఉండాలి కానీ పుష్పకు ఏమాత్రం తక్కువగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్‌ను పక్కనబెట్టి అట్లీని ఎంచుకున్నాడు. ఇదొక్కటేనా? పుష్ప చిత్రానికి ముందు మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రానికి ఓకే చెప్పాడు. అప్పట్లో అఫీషియల్‌గా పోస్టర్ లాంచ్ కూడా చేశారు. కానీ ‘పుష్ప’ తెచ్చిపెచ్చిన హైప్‌తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ‘ఐకాన్’నుంచి సైడ్ అయిపోయాడని వార్తలు వచ్చాయి. తాజాగా దిల్ రాజు.. ‘తమ్ముడు’ ప్రమోషన్స్‌లో భాగంగా దీనిపై స్పందించారు. ‘ఐకాన్’ను పక్కనబెట్టలేదని.. మరో హీరోతో ఆ చిత్రాన్ని తీయనున్నట్టు వెల్లడించారు. అల్లు అర్జున్ మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేనని దీంతో క్లారిటీ వచ్చేసింది. ‘ఐకాన్’ అనేది హ్యూమన్ యాక్షన్ స్టోరీ అని ఎప్పుడు తీసినా ఎవర్గ్రీన్ గానే ఉంటుందని దిల్ రాజు వెల్లడించారు.