Allu Arjun :
సోషల్‌మీడియా అరాచకాలపై కన్నేయాల్సిందే. రోజురోజుకి వీరి ఆగడాలు శృతిమించుతుండటంతో ప్రతి ఒక్కరు ఎలర్టు అతుతున్నారు.
సినిమావారిపై, రాజకీయ నాయుకులపైనే కాకుండా సంబంధం లేని వారందరిపై బ్యాడ్ థంబ్‌నెయిల్స్ పెట్టి
ఎంటర్‌టైన్‌మెంట్ అనుకునే సోషల్ మీడియా బఫూన్స్‌కు బుద్ధిచెప్పాల్సిందే. రీసెంట్‌గా అల్లుఅర్జున్‌పై అనేక రకాలైన ట్రోల్స్ జరుగుతున్నాయి.
ఆయన మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా విపరీతమైన బ్యాడ్ థంబ్‌నెయిల్స్ పెట్టి విషపురాతలు రాస్తుండటంతో
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో రెడ్ టీవీ యూట్యూబ్ చానల్‌పై దాడి చేసి అక్కడున్న సిస్టమ్స్‌ని ధ్వంసం చేశారు బన్నీ ఫ్యాన్స్ ఈ రోజు.
ఆ యూట్యూబ్‌లో బన్నీపై పలు అసభ్యకరమైన థంబ్‌నెయిల్స్ పెట్టి పోస్ట్ చేశారు.
‘‘చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్’’, ‘‘హాస్పిటల్‌లో అల్లు అర్జున్ పరిస్థితి విషమం– షాక్‌లో చిత్రపరిశ్రమ’..
ఇలాంటి పోస్ట్‌లు పెడితే ఎవరికైనా ఏ హీరో ఫ్యాన్స్‌కైనా కోపం రావటం సహజమే కదా…చూడాలి ఈ విషయం ఎంతదైరం వెళ్తుందో…శివమల్లాల
Also Read This : ఇండస్ట్రీ నాకు వివేక్‌ని,కిరణ్ అబ్బవరాన్ని ‘క’ సినిమాని ఇచ్చింది….