సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.
ఆయన మీద 105 118 (1 ), రెడ్ విత్ ౩/ 5 BNS సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు.
ఈ కేసు రుజువైతే అల్లు అర్జున్ కు పదేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
కాగా ప్రస్తుతం అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలిస్తున్నారు.
ఆ తర్వాత నాంపల్లి కోర్ట్ కి తరలిస్తారు. ఇక ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బన్నీ అభిమానులు భారీగా తరలివచ్చారు.
దీంతో స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అలాగే సోషల్ మీడియాలోను అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
Also read this : సాయి దుర్గ తేజ్ “SYG ” కర్నేజ్ రిలీజ్…