Allu Arju x Atlee :
అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా ముందుగా నిర్మాత బన్నీ వాస్ చెప్పినప్పట్టుగానే షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలోనే సినిమాను ప్రకటించాడు. అయితే ఆ ప్రకటించిన విధానం మాత్రం చాలా స్పెషల్. ఒక అద్భుతమైన వీడియోను సినిమాను ప్రకటించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రాజెక్టు ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు వీడియో ద్వారా మేకర్స్ వెల్లడించారు. అన్‌బిలీవబుల్ స్టోరీతో బన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వీడియోలో తెలిపారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది.
అత్యాధునిక సాంకేతికతను ఈ సినిమా కోసం వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థను సందర్శించారు. కథ విన్న వీఎఫ్ఎక్స్ నిపుణులతో సైతం ఈ వీడియోలో మాట్లాడించారు. ఇలాంటి స్క్రిప్ట్‌ను తాము ఇప్పటి వరకూ వినలేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు స్క్రీన్ టెస్ట్ చేసిన విజువల్స్ సైతం వీడియోలో చూపించారు. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్స్ ఉంటాయన్న సందేశాన్ని అయితే మేకర్స్ వీడియో ద్వారా ప్రకటించారు.
ప్రజావాణి చీదిరాల