Gaddar Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటిగా నివేదా

తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి గద్దర్ అవార్డుల పండుగను ప్రారంభించారు. సినీ ప్రముఖులు బాలకృష్ణ, మణితర్నం, సుహాసిని, రాజమౌళి, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్‌, సుకుమార్‌, చంద్రబోస్ తదితరులు సందడి చేశారు. పలువురు విజేతలకు సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అవార్డులు అందజేశారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డులు అందుకున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనల నడుమ ఈ వేడుక అత్యంత ఆసక్తికరంగా సాగింది.

ఏఏ విభాగాల్లో ఎవరెవరు అవార్డులు అందుకున్నారంటే..

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌
ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్‌
ప్రథమ ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ద్వితీయ ఉత్తమ చిత్రం: పొట్టేల్‌
తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్‌: మేం ఫ్రెండ్సండీ
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్‌ శ్రీరామ్‌: ఊరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)
ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్‌: పుష్ప2 (సూసేకి అగ్గిరవ్వ మాదిరి..) (హాజరు కాలేదు)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేష్‌ ఆచార్య (దేవర-ఆయుధపూజ)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తు వదలరా2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అధ్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌కుమార్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: అరుణ్‌ దేవ్‌ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)
ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కమ్యూనల్‌ హార్మోనీ సోషల్‌ అప్లిస్ట్‌: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ చారిత్రక చిత్రం :రజాకార్‌
స్పెషల్‌ జ్యూరీ: దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)
స్పెషల్‌ జ్యూరీ: అనన్య నాగళ్ల (పొట్టేల్‌)
స్పెషల్‌ జ్యూరీ: సుజిత్‌, సందీప్‌ (క)
స్పెషల్‌ జ్యూరీ: ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ (రాజు యాదవ్‌)
జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ : ఫరియా అబ్దుల్లా (మత్తువదలరా)
ఉత్తమ తొలి చిత్రం: యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు)

స్పెషల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్‌ అవార్డు: మణిరత్నం
బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు: సుకుమార్‌
నాగిరెడ్డి అండ్‌ చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు: అట్లూరి పూర్ణ చంద్రరావు
కాంతారావు ఫిల్మ్‌ అవార్డు: విజయ్‌ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్‌
జ్యూరీ కమిటీ మెంబర్స్ మురళీ మోహన్‌, జయసుధ తదితరులు సైతం పురస్కారాలు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *