‘రామాయణ’ బడ్జెట్ విని అంతా షాక్.. ఎవరూ ఊహించలే..

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రామాయణ’ను రూపొందించనున్న విషయం తెలిసిందే. నితీశ్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ‘రామాయణ’ పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఇది రూపొందుతోంది. నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్‌ ఏంటో చెప్పి నమిత్ మల్హోత్రా షాకిచ్చారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కోసం నిదులు సమకూర్చుకుంటున్నామని.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదన్నారు. ఏడేళ్ల క్రితమే దీని పనులను ప్రారంభించినట్టు నితీశ్ తివారి తెలిపారు.

‘రామాయణ’ను ఏకంగా రూ.4 వేల కోట్లతో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ రూపొందిన ఏ భారతీయ సినిమా కూడా ‘రామాయణ’ దరిదాపుల్లోకి రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఈ ఇతిహాసాన్ని చూడాలన్న లక్ష్యంతోనే ఇంత భారీ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు నితీశ్ తివారి తెలిపారు. గతంలో ఈ సినిమా బడ్జెట్‌పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇంత బడ్జెట్ అని ఎవరూ ఊహించలేదు. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా నటిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *