మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైన విషయం తెలిసిందే.
భక్త కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు ప్రభాస్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మోహన్ బాబు ఈ సినిమాను సుమారు రూ.200కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఆయన కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు వంటి వారి పాత్రలను పరిచయం చేయగా..
ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రను కూడా పరిచయం చేసారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : పుష్ప రీలోడెడ్ వెర్షన్ కలెక్షన్ ఎంతో తెలేస్తే షాక్ అవుతారు
