Akshaye Kanna :
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ‘హను-మాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. దీంతో ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టులపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ మహాకాళి చిత్రం పీవీసీయూలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా సైతం నటిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Raed This : వామ్మో.. నాస్తికుడినని చెప్పుకునే ఆర్జీవీ నవమినాడు గుడిలో ప్రత్యక్షం