...

Akkineni Akhil: గతాన్ని తరమటానికి పోతా.. మా నాయనో మాట సెప్పినాడు..

అక్కినేని హీరో అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ ఓ సినిమాను లైన్‌లో పెట్టాడు. ‘లెనిన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మురళి కిశోర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇవాళ అఖిల్ పుట్టినరోజు కావడంతో తను నటిస్తున్న సినిమా గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ అయితే ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దానిలో రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

‘గతాన్ని తరమటానికి పోతా.. మా నాయన నాకో మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా.. పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటది. ఆ పేరు ఎట్లా ఉండాలంటే..’ అంటూ అఖిల్ అదరగొట్టేశాడు. మాంచి మాస్ మసాలాతో అఖిల్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నాడని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.