Akhanda 2: నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ రూపొందుతోంది. ‘అఖండ తాండవం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇవాళ (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఆ టీజర్ చూస్తుంటే నిజంగానే అఖండ తాండవాన్ని మనం చూస్తామనే అనిపిస్తుంది.

బాలయ్యపై చిత్రీకరించిన ఒక యాక్షన్ సన్నివేశాన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మేకర్స్ విడుదల చేశారు. ‘‘నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?’’ అనే డైలాగ్‌తో బాలయ్య.. ప్రత్యర్థులపై శివతాండవమాడతాడు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *