Sree Vaani :
హీరోలు, హీరోయిన్లు ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మాత్రం సుమారు పదిహేను నుండి ఇరవై సినిమాల్లో నటిస్తారు.
1996లోనే థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని అనేక షోలలో నటించిన తర్వాత సినిమాకి, నటనకి దూరమయ్యారామె.
దానికి కారణం సినిమాకి ఏ మాత్రం సంబంధంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగుళూరు వెళ్లిపోవటమేనట.
సంసార సాగరంలో పడి బాధ్యతగల ఇల్లాలిగా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దచేసి వాళ్లు ప్రయోజకులు అయ్యారు అని నిర్ణయించుకున్నాక మళ్లీ నటనవైపు అడుగు పెట్టారామె.
కరోనా తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు నటి శ్రీవాణి.
రీసెంట్‌గా ఆమె నటించిన ‘జనక అయితే గనక’ చిత్రంలో సుహాస్‌కి తల్లిగా నటించారు. చాలా తక్కువ సమయంలో అగ్ర నిర్మాతల, దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నారామె.
గతేడాది దసరాకి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ లో నటించాను, ఈ దసరాకి ‘జనక అయితే గనక’లో నటించాను.
రెండు దసరాలకి వచ్చిన నేను నటించిన చిత్రాలు విడుదలై విజయం సాధించటంతో ఒకేసారి రెండు పండుగలు వచ్చాయి అంటున్నారు శ్రీవాణి.
అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో శ్రీవాణి రాతలు చాలా ఫేమస్. తెలుగులో పి.జీ చేశారట ఆమె.
అందర్ని ప్రశ్నించే విధంగా శ్రీవాణి రాతలు ఉండటంతో ఆమె ఎక్కడినుండి వచ్చారు? అసలు ఆమె రాతేంటి? ఏం చదువుకున్నారు? తన కుటుంబ నేపధ్యం ఏంటి?
అనే చిన్న క్యూరియాసిటీతో ఆమెను ఇంటర్వూ చేయటం జరిగింది.
చంద్రబాబు గారిని, పవన్ కల్యాణ్ గారిని ఫేస్‌బుక్ లో అంత బాహాటంగా ఎందుకు సపోర్టు చేశారు?
జాని మాస్టర్ కేసు విషయంలో నాకు అతను ముఖ పరిచయం కూడా లేదు. కానీ నా పూర్తి మద్దతు జానికే అని అంత నిర్మొహమాటంగా ఎందుకు మాట్లాడారు?
ఇలాంటి ఎన్నో విషయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు నటి శ్రీవాణి. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఇంటర్వూ ఇన్ శ్రీవాణి కెరీర్. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : సోషల్ మీడియా వ్యసనం మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది