...

మగ్‌ స్టోరిస్‌తో అనితా చౌదరి కొత్త కథ షురూ

తెలుగు లోగిళ్లలో కస్తూరిగా అందరికి పరిచయమైన ప్రముఖ యాంకర్, అందాలనటి అనితా చౌదరి. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన అనితా చౌదరి కిచెన్‌ రంగంలోకి అడుగులు పెట్టి శుక్రవారం హైదరాబాద్‌లో ఒక కాఫీ షాప్‌ని ఆరంభించారు. ఆ కాఫీ షాప్‌ పేరు ‘మగ్‌ స్టోరీస్‌’..ఏ కేఫ్‌ అండ్‌ కిచెన్‌ బై అనితా చౌదరి అని ట్యాగ్‌లైన్‌ పెట్టారామె. ఎంతోమంది నటీనటులు అనేక రకాలైన బిజినెస్‌లు చేస్తూ ఏదోరకంగా ప్రేక్షకులతో కలిసి ఉండాలని ఇష్ట పడుతున్నారు.

అనితా చౌదరి ఈ కాఫీ షాపును పెట్టటానికి కూడా కారణం మంచి బ్రాండ్‌ క్రియేట్‌ చేసి తాను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకుంటున్నారు. అందుకే చాలాకాలం అమెరికాలో నివాసం ఉన్న ఆమె తనకు కూడా ఒక బ్రాండ్‌ క్రియేట్‌ కావాలనే ఉద్ధేశంతో కొన్ని మగ్గుల్లో కాఫీలు మాత్రమే ఉండవు.. ఆ మగ్‌లో ఎన్నో ఎమోషన్స్‌ ఉంటాయి తనదైన స్టైల్‌లో మగ్‌స్టోరీస్‌ను ప్రమోట్‌ చేస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో హీరో నిఖిల్, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్, ఉత్తేజ్, డైరెక్టర్ నందిని రెడ్డి, కౌశిక్, రఘు బాబు, బి వి ఎస్ రవి మరియు ఇతర ప్రముఖులు పాల్గొని అనిత చౌదరి కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ఒక్క మగ్‌ స్టోరీ వందల మగ్‌ స్టోరీస్‌కి పునాది కావాలని కోరుకుంటూ అల్‌ ది వెరీ బెస్ట్‌ టు మగ్‌ స్టోరీస్‌ అండ్‌ అనితా చౌదరి అంటూ విశెష్‌ను తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్‌….
శివమల్లాల

Also Read This : వందమందికి పైగా ఐ టెస్టులు. ఆనందం వ్యక్తం చేసిన జర్నలిస్ట్ కుటుంబాలు.

 

MUG Stories Cafe & Kitchen
MUG Stories Cafe & Kitchen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.