Killi Kranthi Kumar :
చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లతో
ఒక్క సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపించటం కోసం తహతహలాడుతుంటారు.
అలాగే ఎస్.ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి.వినాయక్, సుకుమార్, హరీశ్‌శంకర్, మలినేని గోపిచంద్,
అనిల్ రావిపూడిలాంటి దర్శకులనుండే కాకుండా కొత్తతరం దర్శకులనుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అన్నట్లు
చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు. ఇలా కలలు కనే అనేకమంది కలలు నెరవేరటానికి చాలా సమయమే పట్టొచ్చు.
కానీ చాలా తక్కువ సమయంలో పైన చెప్పిన నటులందరితో నటించే అవకాశం దక్కించుకున్నారు ఈ వర్ధమాననటుడు.
నా గాడ్‌ఫాదర్ చిరంజీవిగారు. చిన్నప్పటినుండి ఆయనతో ఒక సినిమాలో అయినా కలిసి నటించాలి అని కలలు కనేవాడిని.
అలాంటిది నా మొదటి సినిమాలోనే బాస్‌తో ఖైధీనంబర్ 150 సినిమాలో చిన్న సీన్‌లో నటించే అవకాశం రావటమే నా అదృష్టం.
ఆ సినిమా తర్వాత వరుసగా అనేక సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.
డిసెంబర్ 5వ తేదిన ‘పుష్ప–2’తో మొదలుకొని జనవరిలో ‘గేమ్‌ఛేంజర్’ ఇలా ప్రతినెల ఒక సినిమా చొప్పున ఆరునెలలు నా సినిమాలు విడుదలవుతున్నాయి.
ఇంతకీ నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పలేదు కదూ. నేను మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి గారి రెండవ అబ్బాయిని
నా పేరు కిల్లి క్రాంతి…అంటూ తన రాజకీయ, సినిమా విశేషాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నారు.
–అమ్మా, నాన్న కంటే దైవమే ముఖ్యం అంటాడు.
–రోజు రెండుగంటలు పూజచేస్తాను అంటాడు.
–ధైవం గురించి, వేదాల గురించి మాట్లాడటం వల్లే నందమూరి బాలకృష్ణగారికి నాకు అక్కడే సెట్ అయ్యింది అంటాడు.
– ఈ భూమ్మీద భారతదేశం ఒక్కటే హిందూ దేశం అందుకే నా ప్రతిమాటలో భారతీయత, ధైవత్వం ఉండేటట్లు చూసుకుంటాను.
మాటకుముందు జైశ్రీరాం అంటూ పూనకం వచ్చినవానిలా సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు.
– నేను పవన్‌కళ్యాణ్ ఫ్యాన్‌కాదు.. చిరంజీవి, రామ్‌చరణ్ ఫ్యాన్‌ని అంటాడు.
ఇతనితో మాట్లాడుతుంటే ఎవరైనా సరే కొంచెం కంగారుపడటం సహజం.
– మీరు ఓ సారి ఈ ఇంటర్వూ చూడండి.ఎందుకు అలా చెప్తున్నానో అర్ధం అవుతుంది. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : దిల్‌రాజు డ్రీమ్స్ ప్రొడక్షన్స్ ఎవరికోసం? ఎందుకోసం?