శనివారం ఉప్పల్ స్టేడియం లో సిక్సర్లతో మోత మోగించి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 246 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు తొలి వికెట్ కు 171 పరుగులు చేసి భారీ తొలి వికెట్ పార్టనర్ షిప్ దక్కించుకుంది. ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 67 పరుగులు (9 ఫోర్స్ 3 సిక్సులు) సాధించటంతో తొలి వికెట్ కు చక్కని ఆరంభం లభించింది. హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలో 211 పరుగులు చేసి లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఈ క్రమంలో అభిషేక్ 54 బంతుల్లో 141 పరుగులు (14 ఫోర్స్ 10 సిక్సర్లతో)చేసిఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైయెస్ట్ రన్స్ చేసిన ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ఛేజ్ గా ఈ మ్యాచ్ నమోదు చేసుకుంది. మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే మ్యాచును సొంతం చేసుకుంది ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన హైదరాబాద్ జట్టు..
Also Read This : NTR: కన్నీళ్లు ఆపుకోవడం నా వల్ల కాలేదు