అథర్వ మురళి, నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీఎన్ఏ’. తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి తెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి తన ఎస్‌కే పిక్చర్స్‌పై ‘మై బేబి’ చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘‘మై బేబి’ సినిమా తమిళ వెర్షన్ డీఎన్ఏ చూశాక ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనిపించింది. వాళ్లు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. నేను గతంలో చేసిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి చెప్పాను. అప్పుడు నా మీద నమ్మకంతో వాళ్లు ఈ సినిమా రైట్స్ మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్రానికి నాతో పాటు యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి సాయిచరణ్ గారు తోడయ్యారు. నిన్న ప్రీమియర్ షో వేశాం. మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు చూసి కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది. దాదాపు 350 స్క్రీన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు వస్తోంది. నైజాంలో 130కి పైగా స్క్రీన్స్ పడుతున్నాయి. ఇన్ని థియేటర్స్ లో నా సినిమా రావడం హ్యాపీగా ఉంది. ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి. మంచి మదర్ సెంటిమెంట్ ఉండి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది’’ అన్నారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించాడు. అప్పట్లో ఓటీటీలు లేవు కాబట్టి మరో భాషలోని సినిమా మనం చూడాలంటే డబ్బింగ్ లోనే చూడాలి. అలా సురేష్ కొండేటి చేసిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. “మై బేబి” సినిమా కూడా ప్రీమియర్ షోస్ నుంచి అద్భుతమైన టాక్ తెచ్చుకుంటోంది. ట్రైలర్ చూస్తే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమిదని తెలుస్తోంది’’ అన్నారు. కో ప్రొడ్యూసర్ సాయిచరణ్ తేజ మాట్లాడుతూ… ‘‘మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో సురేష్ కొండేటి గారు పరిచయమయ్యారు. ఆయన జడ్జిమెంట్‌ను మేము నమ్ముతున్నాం. “మై బేబి” సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాం. ఇకపై కూడా సురేష్ గారితో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల