హీరో రవితేజకు పితృవియోగం.. చిరంజీవి సంతాపం

హీరో రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు (90) గత రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు సంబంధిత కారణాల రీత్యా బాధపడుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటకు చెందిన భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టుగా పని చేసేవారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కొడుకులు. రవితేజ పెద్దవాడు. మిగిలిన ఇద్దరు కుమారులు భరత్, రఘులు కూడా సినీ నటులే. కొంతకాలం క్రితం భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు మరణంపై చిరంజీవి స్పందించారు. ‘‘రాజగోపాల్ రాజు మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశానన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *