రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ‘ఎస్ఎస్ఎంబీ 29’ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ బయటకు వచ్చి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా గురించి తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ స్పందించారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రాలకు ఆయనే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఈ సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్ అని అంతా భావించారు. కానీ తాను మహేష్, రాజమౌళి కాంబో కోసం వర్క్ చేయడం లేదని సెంథిల్ తెలిపారు. ఈ సినిమాకు అందరూ కొత్త వాళ్లకే అవకాశం ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నారని సెంథిల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక సినిమాకు సంబంధించిన సన్నివేశాలను కెన్యాలో చిత్రీకరించాలని భావించారు.