కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ మొత్తం బూతుల మయం..

కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘K-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ‘K-ర్యాంప్’ నుంచి నేడు (సోమవారం) ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ పేరిట గ్లింప్స్ విడుదలయ్యాయి. వాస్తవానికి ఈ గ్లింప్స్ చూస్తుంటే మామూలు చిల్లరగా అనిపించడం లేదు.

ఇప్పటి వరకూ కిరణ్ అబ్బవరం డీసెంట్ చిత్రాలే చేస్తూ వచ్చాడు. ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత వచ్చిన ‘దిల్‌రూబ’ ఆయనకు బాగానే దెబ్బేసింది. ఇక ఇప్పుడు ‘K-ర్యాంప్’ చిత్రంతో రాబోతున్నాడు. గ్లింప్స్ చూస్తుంటే బూతులు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక చిల్లరగా తిరిగే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం చెప్పే ప్రతి డైలాగ్‌లోనూ బూతు కనిపిస్తుంది. చివరకు ‘ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..’ అంటూ చెప్పే డైలాగ్‌లోనూ ఆథెంటిసిటీ దగ్గర చిన్న గ్యాప్ ఇచ్చి బూతుకు తెరదీశాడు. ఎందుకిలా? బూతులు ఉంటే తప్ప తెలుగు సినిమా ఆడదని ఎవరైనా కిరణ్ అబ్బవరం చెప్పారా? లేదంటే తనే అలా ఫిక్స్ అయ్యాడా? కనీసం నిమిషన్నర కూడా లేని గ్లింప్స్‌లోనే ఇన్ని బూతులుంటే సినిమాలో ఇంకెన్ని ఉంటాయో..

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *