రాజ్‌తో కలిసున్న ఫోటోలను షేర్ చేసిన సమంత.. ఆయన భార్య పోస్ట్ వైరల్

ప్రముఖ నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా సమంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రాజ్ సతీమణి శ్యామాలి తన ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా ఆమె ఓ సందేశాన్ని పంచుకుంది. ఆ సందేశం.. సమంత, రాజ్‌ల గురించేనంటూ అంతా చర్చించుకుంటున్నారు. అసలు శ్యామాలి పోస్ట్ ఏం పెట్టారంటే.. ‘మతం ఏదైనా కూడా మన చర్యలతో ఇతరులను బాధించవద్దని చెబుతుంది అదే మనం మన జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం’’ అని చెబుతోంది. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం’’ అని పేర్కొన్నారు. అది చూసిన నెటిజన్లు.. ఈ పోస్ట్ సమంత గురించేనంటూ చెప్పుకుంటున్నారు. వాస్తవానికి శ్యామాలి తరచుగా ఇలాంటి సందేశాలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా పెట్టిన పోస్ట్ సమంత షేర్ చేసిన ఫోటోలకు సింక్ అవుతుండటంతో అంతా ఆమె బాధపడి ఇలాంటి పోస్ట్ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. శ్యామాలి 2023 తర్వాత రాజ్‌తో కలిసున్న ఫోటోలను షేర్ చేసిందే లేదు. వారిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ‘‘ఏది జరగాలని రాసి పెట్టి ఉందో.. అది తప్పక జరుగుతుంది. దానిని ఆపడానికి మీరెంత ప్రయత్నించినా ఆగదు కాబట్టి మౌనంగా ఉండటమే ఉత్తమం’’ అని శ్యామాలి పేర్కొన్నారు. శ్యామాలి ఇన్‌స్టా స్టోరీస్‌లో పెడుతున్న ఒక్కో పోస్ట్‌తో సమంత, రాజ్ నిడుమోరు మరింత వైరల్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *