మరోసారి జంటగా కెమెరాకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడమే ఇందుకు కారణం. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ముంబై ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ కలిసి వెళుతున్న వీడియో అది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి వీరిద్దరూ కారులో బ్యాక్ సీటులో కూర్చొని ప్రయాణం చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అదిప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీరిద్దరూ రిలేషన్‌లోనే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండలు తమ సినిమాలకు ముందు ఒకరినొకరు అభినందించుకుంటారు. ప్రస్తుతం రష్మిక నటించిన ‘కుబేర’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ.. రష్మికతో పాటు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. తన కెరీర్‌లో శేఖర్ కమ్ములకు ప్రముఖ స్థానముందని.. తనలాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేశారని.. తన అభిమాన నటులు నటించిన ఈ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ప్రస్తుతం విజయ్ ‘కింగ్‌డమ్’ మూవీలో నటిస్తున్నాడు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *