రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా గ్లింప్స్ కొంత కాలం క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే గ్లింప్స్ అంచనాలను పెంచేయడమే కాదు.. ఓటీటీ డీల్‌కు సైతం రెక్కలు కట్టేసిందని టాక్. రామ్ చరణ్ గ్లింప్స్‌లో చెప్పిన డైలాగ్స్‌తో సినిమా ఎలా ఉండబోతోందన్న క్లారిటీ దాదాపు అందరికీ వచ్చేసింది.
ఈ ఒక్క గ్లింప్స్‌తో భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం రెండు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. చివరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్‌లో కొన్ని కండీషన్స్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. తొలుత రూ.105 కోట్లు అందజేసి.. ఆ తరువాత సినిమా రిజల్ట్‌ని బట్టి మరింత పెంచేస్తామని నెట్‌ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందని సమాచారం. ఒకవేళ ఈ సినిమా కానీ భారీ హిట్ సాధించిందంటే.. నిర్మాతలకు రెండు విధాలుగా లాభాల పంట పండుతుంది. థియేటర్ల నుంచి భారీగా వసూలు అవడంతో పాటు ఇటు ఓటీటీ సంస్థ నుంచి సైతం మరింత డబ్బు కలిసొస్తుంది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది.