ముస్సోరీలో ‘మెగా 157’.. బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో చిరు, నయన్..

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పరూర్తి చేసుకుని తాజాగా రెండో షెడ్యూల్‌లో అడుగు పెట్టింది. ఈ షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నారు. మెగా157 రెండవ షెడ్యూల్ ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ 10 రోజుల షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్, తదితరులు పాల్గొంటారు. చిత్ర బృందం కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ తర్వాత నయనతార ముచ్చటగా మూడోసారి చిరుతో నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి ఒక స్కూల్ గ్రౌండ్ లో టేబుల్ మీద కూర్చోని వుండగా, పిల్లలు తనవైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్‌ అప్‌ ఇస్తూ ప్రజెంట్ చేసిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ విజువల్ చాలా ప్లజెంట్ గా వుంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం మరింత జాయ్‌ని యాడ్ చేసింది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *