సినిమాల్లో ఒకసారి క్లిక్ అయ్యారంటే ఇక వారికి తిరుగుండదు. అవకాశాలు వాటంతట అవే వెదుక్కుంటూ వస్తాయి. ఇక సాధారణ నటుల పరిస్థితే ఇలా ఉంటే స్టార్ హీరోల మాటేంటి? భారీ బడ్జెట్ చిత్రాలు ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతాయి. ఇక ఏదైనా చిత్రంలో వీరు క్యామియో రోల్ చేశారో కోట్లు కాళ్ల ముందు వచ్చి వాలతాయి. ఈ క్రమంలోనే అజయ్ దేవగణ్ క్యామియో రోల్స్‌లో మెరుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఆయన చేసిన క్యామియోకు నిమిషానికి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అజయ్ దేవగణ్ ఎనిమిది నిమిషాల పాటు కనిపించి మెప్పిస్తాడు. నిమిషానికి దాదాపు నాలుగున్నర కోట్ల చొప్పున ఎనిమిది నిమిషాలకు గానూ రూ.35 కోట్లు తీసుకున్నారని సమాచారం. మొత్తానికి సినిమా వచ్చిన ఇన్నాళ్లకు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఒక్క సినిమానే కాదు. ఆయన చేస్తున్న క్యామియో రోల్స్‌తో భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో అజయ్ దేవగణ్ టాప్‌లో ఉన్నారు. అయితే ఈ రెమ్యూనరేషన్ సినిమాను బట్టి కూడా మారుతుందని సమాచారం. సాధారణ సినిమా అయితే రెమ్యూనరేషన్‌ను కాస్త తగ్గిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ వచ్చిన ఇన్నాళ్లకు లేటుగా అయినా లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.