మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, లియో జాన్ పాల్ కాంబోలో రూపొందిన చిత్రం ‘మార్గన్’. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ – క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తున్నారు. సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘‘నాకు లియో జాన్ పాల్ ఐదేళ్లుగా తెలుసు. అతనొక గొప్ప ఎడిటర్ కావడంతో లీడింగ్ డైరెక్టర్లంతా కూడా ఆయనను ఎడిటర్‌గా పెట్టుకుంటారు. ‘మార్గన్’ కథను నాకు చెప్పినప్పుడు అతని స్టైల్ నాకు నచ్చడంతో ఈ సినిమా ఓకే చేశాను. నా సిస్టర్ జయ కొడుకు అజయ్‌ని ఈ చిత్రంతో లాంచ్ చేస్తున్నా. తను ఇంతకు ముందు ‘బిచ్చగాడు 2’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. రామ్ సర్ నాకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ‘నకిలీ’ని తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన నాకు ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ‘మార్గన్’ను రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ‘భద్రకాళి’ కూడా రానుంది. నా మూవీ తెలుగులో రిలీజ్ అవుతోందంటే మొత్తం బాధ్యతను భాష్య శ్రీ గారు చూసుకుంటారు’’ అని తెలిపారు.
లియో జాన్ పాల్ మాట్లాడుతూ .. ‘దర్శకుడిగా ‘మార్గన్’ నాకు మొదటి చిత్రం. ఇంత వరకూ నేను ఎడిటర్‌గా ఎన్నో చిత్రాలను చేశాను. కానీ విజయ్ ఆంటోని గారు మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలను చేశారు. ఆయన సహకారంతో నాకు ఈ సినిమా జర్నీ చాలా ఈజీగా మారిపోయింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ఈగ, మగధీర అంటే నాకు చాలా ఇష్టం. ‘మార్గన్’ కోసం చాలా ఖర్చు పెట్టాం. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి తీశాం’’ అని తెలిపారు.
అజయ్ ధీషన్ మాట్లాడుతూ .. ‘‘మార్గన్’నాకు మొదటి చిత్రం. విజయ్ ఆంటోనీ బ్యానర్‌లో పరిచయడం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన లియో సర్‌కు థాంక్స్. ఆయన చాలా గొప్ప క్రియేటర్’’ అన్నారు.
దీప్సిక మాట్లాడుతూ .. ‘‘ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ ఇలా నా బర్త్ డేను సెలెబ్రేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా లియో జాన్ పాల్ ఈ మూవీని తీశారు. విజయ్ ఆంటోని గారి సినిమాలెప్పుడూ కొత్తగానే ఉంటాయి. సామాజిక అవగాహన కల్పించేలా చిత్రాల్ని తీస్తుంటారు. యూనిక్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు’’ అని తెలిపింది.
బ్రిగిడా మాట్లాడుతూ .. ‘‘నాకు ‘మార్గన్’ చాలా ప్రత్యేకం. ఈ ఏడాదిలో ఇదే నా మొదటి సినిమా. ఎంత ప్యాషన్ ఉన్నా కూడా సహనం కూడా ఉండాలని నేను నమ్ముతుంటాను. నేను అంత సహనంగా వెయిట్ చేశాను కాబట్టే నాకు ‘మార్గన్’ లాంటి చిత్రం వచ్చింది. విజయ్ సర్, లియో జాన్ పాల్ సర్ నాకు కాలేజ్‌లో సీనియర్.మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాను’’ అని తెలిపింది.
ప్రజావాణి చీదిరాల