అప్‌డేట్ ఇవ్వడానికి సిద్దమైన అడివి శేష్

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్ – ఏక్ ప్రేమ్ కథ’. చాలా కాలం అవుతోంది.. అడవి శేష్ మూవీస్ నుంచి అప్‌డేట్స్ అనేవి రాక. ఇన్నాళ్లకు ఆయన తన సినిమా నుంచి అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతోప్రేక్షకులకు ఎక్సైటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్‌ని అందించబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.

‘డకాయిట్’ ఫైర్ గ్లింప్స్ మే 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్‌లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్ ని చూస్తూ ఆ పోస్టర్‌లో కనిపించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ‘డకాయిట్’ కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతోంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *