హీరో సూర్య తన 46వ సినిమాను లాంచనంగా ప్రారంభించేశాడు. గత రెండు సినిమాలు.. ‘రెట్రో, కంగువా’ సూర్యకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో సూర్య మంచి హిట్ చిత్రాలతో ఫామ్‌లో ఉన్న దర్శకుడితో సినిమాను మొదలు పెట్టేశాడు. ‘లక్కీ భాస్కర్, సార్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శఖుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా మే చివరి వారంలో రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించనుంది. రవీనా టాండన్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల