10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కి అర్హత 

ఐపీఎల్ 2025 సీజన్ 60 వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ టైటాన్స్ కు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది. రెండు టీమ్ ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయటంతో పెద్దగా వికెట్స్ పడకుండానే మ్యాచ్ బ్యాటర్స్ కు అనుకూలించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ విజృంభించి ఆడటంతో 65 బంతుల్లో 112 పరుగులు ( 14 ఫోర్లు 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. తనకు తోడుగా 19 బంతుల్లో 30 పరుగులు ( 1 ఫోర్ 3 సిక్సర్లు) చేసిన అభిషేక్ పోరల్, అక్సర్ పటేల్ 16 బంతుల్లో 25 పరుగులు 2 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి పరవాలేదనిపించారు. చివర్లో వచ్చి 10 బంతుల్లో 21 పరుగులు ( 2 సిక్సర్స్) చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ఢిల్లీ జట్టు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ ఓపెనింగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్ 108 పరుగులు ( 61 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్సర్లు) , శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో 93 పరుగులు చేసి ( 3 ఫోర్స్ 7 సిక్సర్లు) ఇద్దరు నాట్ అవుట్ గా నిలిచి రికార్డ్ సృష్టించారు. 10 వికెట్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. 112 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తో పాటు ఈ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *