బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్.మాధవన్, అనన్య పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగులో మే 23న విడుదల కానుంది.
తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ కుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇక సినిమాలోని కోర్టు సన్నివేశాలు ఆకట్టుకునేలా దర్శకుడు చూపించడం జరిగింది. ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుంది.
ప్రజావాణి చీదిరాల