Jayam Ravi : ఆనందంగా బతకండి… బతకనివ్వండి– మోహన్‌ రవి

Jayam Ravi

లైట్స్, కెమెరా, యాక్షన్‌ అని షూటింగ్‌లో ఉన్నప్పుడే వారంతా నటులు, స్టార్లు. మేకప్‌ తీసేస్తే వారంతా మనలాంటి సామాన్యమైన మనుషులే.

ఆడవారికే కాదు మగవారికి కష్టాలుంటాయి అంటూ తమిళ హీరో ‘జయం’ రవి తన వ్యక్తిగత జీవితం గురించి సుదీర్ఘమైన లేఖ రాసి తన కష్టాన్ని ఆ లేఖలో పంచుకున్నారు రవి.

అసలు ఇప్పుడు అతనికొచ్చిన కష్టమేంటి ఎందుకు అతను లేఖను విడుదల చేశారో తన మనోగతాన్ని ఒక్కసారి చదివి తెలుసుకోండి…

16 ఏళ్లుగా వివాహబంధంతో తాను ఎలా తనలో తాను నలిగిపోతున్నాడో తెలియచేస్తూ ఒక లెటర్‌ విడుదల చేశారు తమిళ అగ్రనటుడు మోహన్‌ రవి. మౌనంగా చూస్తూ కూర్చుంటే తన మీద ఎంతటి అభాండాలు వేయటానికైనా వెనుకాడని తన మాజీ భార్య ఆర్తి గురించి ఆమె తల్లితండ్రుల గురించి తనకు తెలుసని అందుకే ఈ ఒక్క లెటర్‌తో అందరికి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నాని లెటర్లో పేర్కోన్నారు రవి. అసలు వివరాల్లోకి వెళితే గత ఏడాది క్రిస్‌మస్‌ రోజున రవి కట్టుబట్టలతో (నైట్‌ డ్రెస్‌), పర్స్, ఫోన్‌తో పాటు చెప్పులు కూడా లేకుండా అన్నీ వదిలేసి ఇంట్లోనుండి అందరిని వదిలేసి వెళ్లిపోయారట. ఆ తర్వాత తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనకు విడాకులు కావాలని కోరుకున్నాడు. కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అందుకే తన లెటర్‌లో నేను విడాకులు తీసుకుంది కోరుకుంది నీతో కాని నా పిల్లలతో కాదు. నా పిల్లలు నా గర్వం, గౌరవం. నన్ను నా కష్టాన్ని , మానసికంగా నేను పడుతున్న బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏ రోజు మీతో గౌరవింపబడక పోగా నన్ను మీ అవసరాలకు బంగారుబాతులా ఉపయోగించుకున్నారు. మీరు చేసిన అప్పులకు ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ సంతకం పెట్టటానికి, మీరు ఏ సినిమా చేయమంటే ఆ సినిమా చేయటానికి మాత్రమే నేను మీకు కావాలి. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలోని అందరికి తెలుసు.

నెలరోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో పిల్లలికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయని తెలిసి వాళ్లను చూడటానికి వస్తే బౌన్సర్స్‌ని పెట్టి వారి దగ్గరికి కూడా వెళ్లనివ్వలేదు. అదే కారు ఇన్సూరెన్స్‌కోసం మాత్రం నా సంతకాలు కావాల్సి నా దగ్గరికి తన మనుషులు వచ్చారు. ఇదెక్కడి న్యాయం. అలాగే గత ఐదేళ్లుగా నా సొంత తల్లితండ్రులకు ఒక్క రూపాయికూడా సాయం చేయలేకపోయాను. ఇదంతా మీ వల్లే. అందుకే ఓపిక నశించి ఈ రోజు అందరి ముందుకు వచ్చి నిల్చున్నాను. ఇకపోతే నా స్నేహితురాలు కెనిషా ప్రాన్సిస్‌ గురించి కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. తనతో ఉన్న కొన్నిరోజులు నా జీవితంలోనే ఎంతో ఆనందకమైన రోజులు. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆమె నాకు తోడుగా నిలిచిన గొప్ప స్నేహితురాలు. ఆమె గురించి తప్పుగా మాట్లాడేవాళ్లందరికి ఇదే నా విన్నపం. నా ఫ్యాన్స్, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రతిఒక్కరూ నాకు అండగా నిలిచి భవిష్యతులో సాయంగా నిలబడతారని నమ్ముతున్నా. అలాగే న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో ఉన్నా. కోర్టుచ్చే తీర్పును గౌరవించి రాబోయో రోజుల్లో నా జీవితాన్ని మరింత ఆనందగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్థాను అని లెటర్‌లో పేర్కోన్నారు మోహన్‌ రవి వరుఫ్‌ ‘జయం’ రవి. చివరగా ఆనందంగా బ్రతకండి , బ్రతకనివ్వండి…అంటూ తన సుదీర్ఘ లేఖలో పేర్కోన్నారు.

ఈ లెటర్‌ చదివిన తర్వాత భార్యభర్తలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా కలిసి జీవితకాలం ఇబ్బందిపడే కంటే విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ఆనందంగా ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడించిన రవితో ఎంతమంది ఏకిభవిస్తారో చూడాలి మరి…..

శివమల్లాల

Also Read This : కర్మణ్యే వాధికారస్తే సినిమా నిర్మాత దుర్గాప్రసాద్‌ మాటలు ఎంతో ఎమోషనల్‌…

Jayam Ravi
Jayam Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *