Siddu Jonnalagadda:గ్రాండ్ గా మొదలయిన “తెలుసు కదా”..!

Siddu Jonnalagadda:స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా మరియు కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి లు హీరో హీరోయిన్ లుగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా తెలుసు కదా. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

హైదరాబాద్ లో పూజ కార్యక్రమంతో ఈ సినిమా స్టార్ట్ అయింది. హీరో నాని క్లాప్ కొట్టగా, డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తరువాత హరీష్ శంకర్ మొదటి షాట్ ని షూట్ చేయాగా హీరోలు నితిన్, ఆది పినిశెట్టి స్క్రిప్ట్ ను డైరెక్టర్ కు అందించారు.
ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తుండగా, కెమెరా మ్యాన్ గా యువరాజ్ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ లు వర్క్ చేస్తున్నారు.
ఇంతకాలం సెలబ్రిటీలకు స్టయిలిస్ట్ గా వర్క్ చేసిన నీరజ కోన మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది కావడంతో ఇండస్ట్రీ నుండి కూడా మంచి సపోర్ట్ లభించింది.
ఇక ఈ ఈవెంట్ లో నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ మరియు కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మరియు దర్శకురాలు నందిని రెడ్డి, రైటర్ కోన వెంకట్ లు పాల్గొని చిత్ర యూనిట్ కి తమ బెస్ట్ విషెస్ తెలిపారు.

Also Read :ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?

 

Padma Awards:

తెలంగాణ నుంచి ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారాలు

అందజేసింది. దీంతోపాటు ప్రతి నెలా వారికి రూ.25 వేల చొప్పున పెన్షన్ కూడా అందజేస్తున్నట్లు ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతలకు

ఆదివారం పౌరసన్మానం చేసిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో

భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

వీరితోపాటు తెలంగాణకు చెందిన, వివిధ రంగాల్లో విశేష కృసి చేసిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల

విఠలాచార్యలకు పద్మశ్రీ పురస్కాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీరందరినీ సన్మానించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆదివారం

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆ కార్యక్రమం నిర్వహించింది. వీరందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులను సముచితంగా గౌరవించే

రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యానని తెలిసిన క్షణంలో చాలా సంతోషం కలిగిందని

అన్నారు. అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే తన జన్మధన్యమైనట్లు అనిపిస్తోందని అన్నారు. పద్మ పురస్కారాలు ప్రకటించిన తర్వాత కూడా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *