హైదరాబాద్‌లో ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్.. ఎప్పుడంటే..

భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టనుంది. మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ మే 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మే 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరుగనుంది. దీనికి ముందు చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్.. చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో లైవ్ పెర్ఫార్మెన్స్‌తె ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *