Prabhudeva: నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న కామెడీ థ్రిల్లర్

ఓటీటీ వచ్చాక చాలా మంది సినిమా థియేటర్లకు వెళ్లడమే మానేశారు. స్టార్ హీరోనో.. లేదంటే భారీ బడ్జెట్ సినిమానో అయితే తప్ప థియేటర్ మొహమే చూడటం లేదు. థియేటర్‌లోకి వచ్చిన సినిమాలు మహా అయితే రెండు నెలల్లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక డబ్బింగ్ చిత్రాలైతే కొన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారరు. తొలుత కొరియోగ్రాఫర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభుదేవా.. ఆపై నటుడిగానూ.. దర్శకుడిగానూ మారిపోయారు.

ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం ‘జాలీ ఓ జింఖానా’ గతేడాది నవంబర్‌లో తమిళంలో థియేటర్లలో విడుదలైంది. ఇటీవల ఈ సినిమా తెలుగు వర్షన్ రూపొందింది. అది నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్‌ను నడుపుతుంటాడు. ఒకరోజు ఆ ప్రాంత ఎమ్మెల్యేతో ఈ మహిళలకు అనుకోకుండా గొడవ అవుతుంది. దీనికి తోడు వీరికి మరో సమస్య ఎదురవడం.. దాని నుంచి బయటపడేస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్లడం.. అక్కడికి వెళ్లే సరికి సదరు లాయర్ శవమై ఉండటం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *