SS.Rajamouli : ఉద్రికత్తల వేళ.. ప్రజలకు వేలిడ్ సజెషన్ ఇచ్చిన రాజమౌళి

SS.Rajamouli :

ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. ఇక పాక్‌ను ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగానూ.. ప్రశాంతంగానూ ఉండాలని దర్శకధీరుడు రాజమౌళి ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక వేలిడ్ సజెషన్ ఇచ్చారు. అదేంటంటే.. భారత సైన్యం తారసపడితే వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టవద్దన్నారు. అది శత్రువులకు సాయం చేసినట్టు అవుతుందని రాజమౌళి తెలిపారు. ‘‘భారత సైన్యం కనిపించినా.. లేదంటే ఏదైనా కదలిక కనిపించినా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. ఇలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్టే అవుతుంది. అలాగే అసత్య ప్రచారంతో పాటు ధృవీకరించిన ప్రకటనలను నమ్మకండి’’ అని రాజమౌళి పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *