పాక్‌కు భంగపాటు.. అయినా తగ్గట్లే..

భారత్‌ ముందు పాకిస్థాన్ తోక జాడించడమంటే.. ఆంజనేయుడి ముందు కుప్పి గంతులు వేయడమే. తెలిసి తెలిసి ఏం చూసుకునో కానీ భారత్‌పై దాడికి పాల్పడుతూనే ఉంది. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాక్‌ దాడి చేసింది. ఇంత చేస్తున్నా భారత్ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? ప్రతిస్పందనగా పాక్‌లోని మూడు ప్రధాన వైమానికి స్థావరాలపై పంజా విసిరింది. ఈ విషయాన్ని పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు. ముఖ్యంగా రావల్పిండిలో పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఈ సైన్యం ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాపై భారత్ దాడి చేసింది.

భారత్ చేస్తున్న దాడిపై సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం పేర్కొంది. ఇక భారత్‌పై నిర్వహించనున్న దాడులకు పాక్ సైన్యం ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరును సైతం పెట్టింది. ఈ దాడులపై నేడు భారత్ స్పందించే అవకాశం ఉంది. గురువారం మాదిరిగానే శుక్రవారం ఉదయం ప్రశాంతత, చీకటి పడగానే భారత్‌పై మరోసారి దాడికి పాక్ సైన్యం యత్నించింది. బారాముల్లా నుంచి భుజ్ వరకూ ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపొరా వైమానిక స్థావరాలతో పాటు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లను పంపింది. వాటన్నింటినీ భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అన్ని డ్రోన్లనూ నిర్వీర్యం చేసింది. తిరిగి శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు చేపట్టినట్టు సమాచారం.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *