Kumari Aunty in OTT:
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి సంచలనం కుమారీ ఆంటీ. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీలతో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిన ఆమె నెల సంపాదన అందరూ ఔరా అని నోరెళ్లబెట్టే స్థాయిలో ఉంది.
దీంతోనే సోషల్ మీడియాలో ఫేమస్ అయింది కుమారీ అంటీ. కానీ.. ఏం కన్నుకుట్టిందో కానీ.. పోలీసులు ఆమె వ్యాపారానికి ట్రాఫిక్ కు అడ్డం అంటూ ఆంక్షలు పెట్టారు. దీంతో తన ఉపాధికి దెబ్బపడుతోందంటూ కుమారీ ఆంటీ గగ్గోలు పెట్టారు.
సీఎం స్పందన స్థాయికి
కుమారీ ఆంటీ విషయం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనకు వెళ్లింది.
ఆయన స్పందించి కుమారి వ్యాపారానికి ఆటంకాలు కల్పించవద్దని ఆమె ఉపాధిని దెబ్బతీయవద్దని ఆదేశించారు.
వాస్తవానికి సోషల్ మీడియానే కుమారిని ఫేమ్ చేసింది. అదే మీడియా ఆమెను ఇరుకునపెట్టింది. సీఎం స్పందించడంతో కథ సుఖాంతమైంది.
ఏకంగా నెట్ ఫ్లిక్స్ కు
ఓటీటీ మాధ్యమాలు అన్నింటిలోకీ టాప్ నెట్ ఫ్లిక్స్. అందులో క్వాంటిటీ, క్వాలిటీ వేరే లెవల్. చాలా హిట్ సినిమాల నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని చూస్తుంటారు. అలాంటి నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు కుమారీ ఆంటీపై మూడు సిరీస్ లు చేయనుండడం విశేషమే.
దీనికి ‘ఫేమ్’ అనే పేరు పెట్టింది. అంటే ప్రాచుర్యంలోకి రావడం అని అర్థం. ఈ మూడు సిరీస్ లలో కేవలం కుమారీనే చూపిస్తారా? ఆమె తరహాలో హైదరాబాద్ లో విజయవంతమైన వీధి వ్యాపారులు, ఇతర వ్యాపారులను చూపిస్తారా? అనేది ఆసక్తికరం.
ప్రాథమిక సమాచారం ప్రకారం కుమారీపైనే మూడు ఎపిసోడ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. నెట్ ఫ్లిక్స్ ఏ విధంగా చిత్రీకరించిందో..?
క్రిష్ణా జిల్లా నుంచి వచ్చి..
కుమారి స్వస్థలం ఏపీలోని క్రిష్ణా జిలా గుడివాడ ప్రాంతం. ఆమె అసలు పేరు దాసరి కుమారి. క్రిష్ణా జిల్లాకు చెందిన అందరిలాగే ఆమెలోనూ మంచి వ్యాపార కళ ఉండడంతో ఫుడ్ స్టాల్ బిజినెస్ నెలకొల్పింది. రుచికి రుచి, అందుబాటు ధర కావడంతో వ్యాపారం డెవలప్ అయింది.
దీంతో ఆమెను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…