...

HIT-3 : నా సినిమా నుంచి లీక్స్ వస్తే చాలా కోపం వస్తుంది

HIT-3 :

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిట్ 3’. అర్జున్ సర్కార్‌గా నాని నట విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నామని ఇప్పటి వరకూ అప్‌డేట్స్ ద్వారా తెలుస్తోంది. ‘హిట్ 2’ మూవీ ఎండింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాని ‘హిట్ 3’పై అంచనాలను అప్పుడే పెంచేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా సినిమా నుంచి లీక్స్ వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఈ మధ్య ‘హిట్ 3’కి సంబంధించి శైలేష్ ఇంటర్వ్యూ చూశా. ఆయన మాట్లాడిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఆయన ఎంతో పరిణతితో మాట్లాడారు. పోలీస్ కేసులకు అంతం అనేది ఉండదు కాబట్టి ఎన్ని చిత్రాలైనా తీయవచ్చు. ఈ ‘హిట్’ ఫ్రాంఛైజీ కొనసాగాలని కోరుకుంటున్నా. నాని ఏ సినిమా చేసినా మంచి సక్సెస్ సాధిస్తుంది. తన నుంచి ఇంత కన్నా ఎక్కువ రావాలి. గతంలో నేను ఊహించిన దానికి మించి నాని దూసుకెళుతున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్’’ అని రాజమౌళి తెలిపారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నివాళిని అర్పించారు. ఆ ప్రాంతంతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. ‘హిట్ 3’ షూటింగ్‌ను అక్కడే జరిపామన్నారు. ఆ ప్రదేశం తమకు ఎన్నో మధురానుభూతులను అందించిందని.. అలాంటి చోట విషాదం జరగడం బాధాకరమని శైలేష్ పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో నానికి రెండు ప్రమాదాలు జరిగాయని.. గాయాలై రక్తస్రావం జరుగుతున్నా కూడా నాని అలాగే షూటింగ్‌లో పాల్గొన్నాడని తెలిపారు. నటన పట్ల నానికి ఉన్న నిబద్దతకు అది నిదర్శనమని శైలేష్ వెల్లడించారు.

Also Read This : సమంత నిర్మాణంలో ‘శుభం’.. మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.