ఈ విజయంతో ఆర్సీబీ మూడో స్థానంలో నిలిచింది.
బెంగళూరు లో జరిగిన ఐ పీఎల్ 42 వ మ్యాచ్ బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 205 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సాల్ట్, విరాట్ కోహ్లి లు ఫస్ట్ వికెట్ కు 61 పరుగులు జోడించారు. 23 బంతుల్లో 26 పరుగులు చేసిన సాల్ట్ వికెట్ కోల్పోయిన తరువాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ 50 పరుగులు ( 27 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు)విరాట్ 42 బంతుల్లో 70 పరుగులు ( 8 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి ఆర్సీబీ టీమ్‌కి భారీ స్కోరు అందించారు. టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు ( 2 ఫోర్లు 1 సిక్సర్ ) జితేష్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు ( 4 ఫోర్లు) రాణించటంతో స్కోరు బోర్డు 205 పరుగుల వద్దకు చేరింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడటంతో 4 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 50 పరుగులు చేసింది. 19 బంతుల్లో 49 పరుగులు (7 ఫోర్స్ 3 సిక్సర్లతో) చేసిన జైస్వాల్ అవుట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన నితేష్ రాణా 22 బంతుల్లో 28 పరుగులు ( 3 ఫోర్లు 1 సిక్సర్) , 10 బంతుల్లో 22 పరుగులు ( 2 ఫోర్లు 2 సిక్సర్లు) ఇద్దరు ధాటిగా ఆడటంతో రాజస్థాన్ జట్టు స్కోరు బోర్డు 9.1 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఫుల్ జోష్‌లో ఉన్నట్లు కనిపించింది.
కానీ 9.1 ఓవర్‌కు 110 స్కోర్ ఉంటే 13.3 ఓవర్లకు స్కోరు కేవలం 26 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్ జట్టు. హెట్మెయర్ 8 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఓవర్ ఓవర్‌కి విజయం రెండు టీంలతో దోబుచులాడింది. 18 ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్ లో 22 పరుగులు రాజస్తాన్ టీమ్ కు రావటంతో మ్యాచ్ రాజస్థాన్ వశం అయింది అనుకున్నారంతా. అప్పటికి ఆర్ ఆర్ స్కోర్ 6 వికెట్లకు 189 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది ఆర్ ఆర్ జట్టు. హెజిల్వుడ్ వేసిన 19 వ ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ ఓవర్ లో హేజిల్ వుడ్ 1 పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయటంతో మ్యాచ్ ఆర్సీబీ ఖాతాలో పడింది. కీలకమైన సమయంలో ధ్రువ్ జురెల్ 34 బంతుల్లో 47 పరుగులు చేసి ( 3 ఫోర్స్ 3 సిక్సర్లు) కొట్టి ఆర్ ఆర్ టీమ్ ను గెలుపు ముందువరకు తీసుకొచ్చాడు కానీ టీమ్ ను విన్నర్‌గా నిలవలేకపోయాడు. 18 వ ఓవర్ ఆర్ ఆర్ జట్టు కి విజయాన్ని ఇస్తుంది అనుకుంటే 19 వ ఓవర్ ఆర్సీబీ జట్టుకు విజయాన్ని అందించింది.
శివమల్లాల