ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత

వర్ధమాన గాయని ప్రవస్తి ఆరాధ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ క్రమంలోనే ప్రవస్తి వ్యాఖ్యలపై గాయని సునీత కూడా స్పందించారు. ప్రవస్తి అన్ని విషయాలను తనకు ఆపాదించుకుని ఫీలవుతోందని అన్నారు. బాల్యంలో ఉండగా ఆమెను ముద్దు చేశానని.. కానీ ఈ వయసులోనూ అలా చేస్తే బాగుండదు కదా అని పేర్కొన్నారు. ప్రవస్తి వ్యాఖ్యలను సునీత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘‘నిన్నంతా సింగర్ ప్రవస్తి, పాడుతా తీయగా జడ్జీలు, జ్ఞాపిక ప్రొడక్షన్స్, ఈటీవీ సంస్థ.. అంటూ పలు ఛానళ్లలో ఒక్కటే డిస్కషన్. ప్రవస్తి ముఖ్యంగా నా పేరు తీసి మరీ మాట్లాడింది కాబట్టి నేను స్పందించాల్సి వస్తోంది. ప్రవస్తిని బాల్యంలో అందరూ ముద్దు చేసినట్టే నేను కూడా ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దుచేశా. ఇప్పుడు నీకు 19 ఏళ్లు.. ఈ వయసులోనూ ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు ముద్దుగా ఉండేదానివి.. చక్కగా పాడేదానికి. అవే లెవల్స్ ఇప్పుడు కూడా మెయిన్‌టైన్ చేసి ఉంటే సంతోషించేవారిలో నేను మొదట ఉండేదాన్ని.

బాగా ఎవరు పాడినా కూడా మేం లీనమై భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటాం. ఆ ఎపిసోడ్స్ నీవు చూసి ఉండవు అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయిపోయి రోడ్డెక్కి నీ బాధను చెప్పుకుంటూ మా గురించి చర్చించే స్థాయికి వెళ్లడం ఒకింత అసంతృప్తిగా ఉంది. నీకో వి షయం చెప్పాలి. నువ్వు ‘పాడుతా తీయగా’లో మాత్రమే కాకుండా చాలా షోలలో పాడావు. మరి నీకు రూల్స్ గురించి తెలియదమ్మా.. ఛానళ్లకు కొన్ని పాటలకే హక్కులుంటాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో ఛానల్స్‌కు కొన్ని పరిమితులుంటాయి. వాటికి లోబడే పాటలను ఎంచుకోవాలి. కొన్ని మార్చాల్సి ఉంటుంది. ఆడియన్స్‌కు ఇలా అన్ని విషయాలు చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *