ఒక టీచర్ దర్శకుడిగా మారి తీసిన సినిమా ఇది..

ఎల్ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏఎల్‌సీసీ’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). జేపీ నవీన్, శ్రావణి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో జేపీ నవీన్ మాట్లాడుతూ.. ‘‘ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అనేది ఎంత కష్టమో అందరికీ బాగా తెలుసు. మా సినిమాకు అన్నీ బాగా సెట్ అయ్యాయి. దయచేసి మాలాంటి కొత్తవాళ్లకు సపోర్ట్ చేయండి’’ అన్నారు. హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. లేలీధర్ రావు గారు ఒక టీచర్.. అలాంటిది ఆయన ఒక ప్యాషన్‌తో డైరెక్టర్‌గా మారి ఈ సినిమా చేశారు. ఈ సినిమా చాలా కొత్తగానూ అందరికీ తప్పక నచ్చుతుంది’’ అని తెలిపింది.

డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చిన్న సినిమా అయినా, ఒక వైవిధ్యంగా ఉంటుంది. నష్టాలు వస్తున్నాయని రైతు వ్యవసాయం ఆపడు. అలాగే ఫ్ల్లాప్ అవుతున్నాయని దర్శకుడు సినిమాలు తీయడమూ మానడు. కొత్త సినిమాలు చేసేందుకు యత్నిస్తూనే ఉంటాం’’ అన్నారు. డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. ‘‘గొప్ప టీచర్ అయిన లేలీధర్‌గారు పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప గొప్ప పాఠాలు చెప్పారు. అలాంటి గొప్ప టీచర్ నేడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ‘‘నేనెంతో ఇష్టంగా తీసిన సినిమా కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమా కోసం కష్టపడిన నా టీం మొత్తానికి పేరు పేరున నా ధన్యవాదాలు’’ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *