మరోసారి ఆర్సీబీ జట్టును గెలిపించిన చేజ్ మాస్టర్

ఐపీఎల్ 20-20లో భాగంగా ఈ ఆదివారం జరిగిన 37 వ మ్యాచ్ పంజాబ్ – రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ 17 బంతుల్లో 33 పరుగులు (5 ఫోర్స్ 1 సిక్సర్ సాయంతో), ప్రియన్స్ ఆర్య 15 బంతుల్లో 22 పరుగులు ( 3 ఫోర్లు 1 సిక్సర్) సాయంతో తొలి వికెట్ కు చక్కని భాగస్వామ్యం అందించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అక్కడ నుండి స్కోర్ బోర్డు వేగం తగ్గింది. జాన్ ఇంగ్లిస్ 29 పరుగులు చేసి పరవలేదనిపించగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శశాంక్ సింగ్ (33 బంతుల్లో ) 31 పరుగులు మార్క్ జాన్సన్ 20 బంతుల్లో 25 పరుగులు (2 సిక్సర్స్) తో కలిసి స్కోరు బోర్డును నత్త నడక లా ముందుకు నడిపించారు. అంతటితో వారి ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద ముగిసింది.

నెక్స్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్స్ కు ఆదిలోనే తొలి ఓవర్ చివరి బంతికి 6 పరుగుల వద్ద సాల్ట్ వికెట్ పడింది. అక్కడ నుండి ఎంతో భాద్యతగా ఇన్నింగ్స్ ను ఆడిన విరాట్ 54 బంతుల్లో 73 పరుగులు (7 ఫోర్స్ 1 సిక్సర్తో) దేవదత్ పడిక్కల్ తో (61 పరుగులు 35 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో) కలిసి 69 బంతుల్లో 103 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అప్పటికే ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమైంది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులు ఆర్సీబీ చేయటంతో ఇంకో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ని అందుకే చేజింగ్ మాస్టర్ అంటారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు విరాట్ 3 సార్లు చేజింగ్లో నాట్ అవుట్ గా ఉన్నాడు. అంటే టీమ్ గెలుపుకోసం ఎంతో బాధ్యతగా ఆడుతున్నాడని అర్థం. అందుకే కెరీర్లో మరో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను అందుకున్నాడు.

శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *