Sarangapani Jathakam: వెనక్కుతగ్గిన ‘సారంగపాణి’

ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam). మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో రూప కొడువాయూర్‌ హీరోయిన్‌‌గా నటించింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్‌ 18న విడుదల కావాల్సి ఉంది. ఎందుకోగానీ ‘సారంగపాణి’ వెనుకడుగు వేశాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న రాబోతున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలోనే మేకర్స్ ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ‘అన్ని వయసుల వారిని అలరించే అచ్చమైన తెలుగు సినిమా’ అని తెలియజేస్తూ పోస్టర్‌ విడుదల చేసింది.

ఈ సినిమా ఎందుకోగానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. గతేడాది డిసెంబర్‌ 24నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ 18కు వాయిదా వేశారు. తిరిగి అది కూడా మార్చేసి ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఒక ఆసక్తికర అంశంతో రూపొందింది. వ్యక్తి భవిష్యత్ అనేది అతడి చేతి రేఖల్లో ఉంటుందా? లేదంటే అతడి చేతల్లోనా? అనే కథాంశంతో తెరకెక్కింది. ఒక యువకుడిలో ఉన్న నమ్మకాలకు.. తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమకు మధ్య కొట్టుమిట్టాడిన యువకుడి కథతో తెరకెక్కుతోంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *