Pradeep Machiraju: అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

Pradeep Machiraju :

టీవీ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు, భరత్, నితిన్ కాంబోలో రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు విలేకరుల సమావేశంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమాలో అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు.. రియల్ లైఫ్‌లో ఏ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారని ప్రదీప్‌ని మీడియా ప్రశ్నించగా.. ‘రీల్ లైఫ్‌లో అమ్మాయిల చుట్టూ తిరగడమే సరిపోతుంది.. రియల్ లైఫ్‌లో తిరిగేందుకు కాస్త సమయం పడుతుంది’ అని ప్రదీప్ తెలిపాడు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ : ‘‘సినిమా విషయమై చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని తెలిపాడు. ఫస్ట్ సినిమా తర్వాత మరో మంచి కంటెంట్ ఉన్న సినిమాని చేయాలని ఫిక్స్ అయిపోయి చాలా కథలు విన్నాం. లక్కీగా ఈ కథ దగ్గర ఆగి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. సినిమా అంటే పాషన్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేశాం. ఇందులో కామెడీ చాలా నేచురల్‌గా.. కథ మొత్తం చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. కృష్ణ అనే క్యారెక్టర్‌లో నటించారు. ఒక ఇంజినీరు భైరలంక అనే గ్రామంలోకి వెళ్లి ఎలా చిక్కుకుపోయాడు? ఆ తరువాత ఏం జరిగిందనేదే కథ. సాధారణంగా ఎవరికీ అలాంటి పరిస్థితి రాదు. రాకూడదని కోరుకుంటున్నా. ఆ వరల్డ్‌లోకి అయితే మిమ్మల్నందరినీ తీసుకెళతాం’’ అని ప్రదీప్ తెలిపాడు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : అందుకే జయలలితను వ్యతిరేకించాల్సి వచ్చింది

Rajendraprasad Interview
Rajendraprasad Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *