...

Tiger Nageshwar Rao : టైగర్ నాగేశ్వర్ రావు రివ్యూ

Tiger Nageshwar Rao :

చిత్రం – టైగర్ నాగేశ్వర్ రావు
నటీనటులు – రవితేజ, నుపుర్ సనన్, రేణు దేశాయ్, సేన్ గుప్తా, అనుపమ్ ఖేర్, మురళి శర్మ తదితరులు..
సినిమాటోగ్రఫీ – ఆర్ మది
మ్యూజిక్ – జివి ప్రకాష్ కుమార్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర్ రావు
నిర్మాత – అభిషేక్ అగర్వాల్
బ్యానర్ – అగర్వాల్ ఆర్ట్స్
డైరెక్టర్ – వంశీ
విడుదల – అక్టోబర్ 20, 2023
రేటింగ్ – 2/5

ఈ దసరా కు రవితేజ కూడా బరిలో దిగాడు. సువర్టుపురం లో బాగా పేరు మోసిన ఒక దొంగ చరిత్రను ఆధారంగా చేసుకొని వంశీ దర్శకత్వంలో

టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించాడు. ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :

కథ గురించి మాట్లాడుకుంటే స్టూవర్టుపురం అనే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలంతా తమ జీవన వృత్తిగా దొంగతనాన్నే భావించి బ్రతుకుతూ

ఉంటారు. అయితే అక్కడ లోకల్ గా ఉండే అధికారులు వారి ఈ అలవాటుని అడ్డుపెట్టుకొని వారి జీవితాలకు తమ అవసరాలు ముడిపెట్టి కొందరిని

వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకుంటారు. అదంతా చూస్తూ పెరిగిన నాగేశ్వర్ రావు అదే టైం లో మరొక దొంగ గా ఎలా మారాడు, తను సువర్టుపురం

దొంగ అనేలా ఎలా ఎదిగాడు, ఆ తరువాత తన జీవితం ఎలా మలుపు తిరిగింది.? తను ఎదురుకున్న అంశాలు ఎంటివి? తన ప్రేమ కథ ఏంటి.? చివరికి ఒక దొంగ గా పెరిగిన తను తన ఊరి కోసం ఎమ్ మేలు చేసి టైగర్ నాగేశ్వర్ రావు గా ఎదిగాడు అన్నది కథ.

కథ విషయానికి వస్తే ఇది ముందుగా చెప్పుకున్నట్టు బయోపిక్, ఒక దొంగ ఒరిజినల్ స్టోరీ అయినప్పటికీ రొటీన్ కథే.

దీనిలో అదిరిపోయే ట్విస్ట్ లు – అబ్బా అనిపిచ్చే అంశాలు ఏమి ఉండవు. కానీ ఈ సినిమా దర్శకుడు వంశీ కథను చాలా మార్పులు చేసాడు, సినిమాటిక్ ఫార్ములాను జతచేసి ఈ సినిమా తెరకెక్కించాడు.

హీరో ఎలా ఉండాలి, తను కథలోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనే అంశంపై వంశీ ఒక క్లారిటీ మైంటైన్ చేసాడు. ఈ సినిమాలో రవి తేజ ను ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో చూపించాడు.

సువర్టుపురం అనే ప్రాతంలో రాజ్యాధికారం ఏలుతున్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన దొంగ ఎలా ఎదిగాడు అనేది బాగా చూపించాడు. ఈ సినిమాలో రవితేజ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

సినిమాలో లవ్ స్టోరీ మరీ సాగతీత లా అనిపిస్తది. ఎమోషనల్ సన్నివేశాలు అన్నిచోట్లా ఆకట్టుకోవు. ట్రీట్మెంట్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపిచ్చింది. సాంగ్స్ అంత క్యాచీగా లేవు.

ఇప్పుడు ఈ టైగర్ నాగేశ్వర్ రావు విషయంలో కూడా చాలా చోట్ల అదే జరిగింది.

వంశీ కథ ను స్టార్టింగ్ మొదలు పెట్టిన విధానం బాగున్నా ఆ తరువాత సస్టైన్ చేయలేకపోయాడు.

నటీనటుల పనితీరు :

ఇక రవితేజ విషయానికి వస్తే రవితేజ ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా అంతే ఎనర్జెటిక్ గా నటించాడు, తన లుక్స్ కూడా బాగున్నాయి, సినిమా 1956 నుండి స్టార్ట్ అవ్వడం బాగుంది,

కానీ అప్పటికాలం నేటివిటీ ని రవి తేజ లో చూపించడం లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. హీరోయిన్స్ గా నటించిన నుపుర్ సనన్ ఉన్నంతలో బానే చేసింది,

ఇంకో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కి కూడా అంతే, తనకి ఇచ్చిన పాత్ర కు న్యాయం చేసింది.

ఇక ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ హేమలత లవణంగా చేయడం కొసమెరుపు, కానీ ఆమె వల్ల ఈ సినిమాకు వచ్చిన లాభం ఏమి లేదు.

అనుపమ్ ఖేర్ నటన ఎప్పటిలాగానే అద్భుతం అని చెప్పాలి.

టెక్నీకల్ విషయాలు :

టెక్నీకల్ విషయాలకు వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్ గా అనిపిచ్చింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో.

మది కెమెరా వర్క్ చాలా బాగుంది. లాంగ్ షాట్ లో వచ్చే అన్ని ఫ్రెమ్స్ ని బాగా చూపించాడు. ముఖ్యంగా ట్రైన్ రాబరీ సిన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు.

ఎడిటర్ తన కత్తికి ఇంకా పదును పెట్టె అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అలానే ఉంచేసాడో అనేది ఎడిటర్ కి డైరెక్టర్ కి తెలియాలి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి.

సినిమాకు సగం బలం యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ విలువలు అంత గొప్పగా ఎం లేవు. సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టారు.

వంశీ డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పలేం అలా అని సక్సెస్ అయ్యాడు అని చెప్పలేం. స్క్రిప్ట్ మీద ఇంకా ఇండస్ట్రీ లో ఉన్న కొందరు టాలెంటెడ్ రచియతలతో కూర్చొని కథ డిస్కస్ చేసి ఉంటే బాగుండు అనిపిచ్చింది.

ఓవరాల్ గా చెప్పాలి అంటే, రవితేజ ను పిచ్చి పిచ్చిగా అభిమానించే అభిమానులకు కూడా ఫుల్ మీల్స్ కాదు ఈ సినిమా.

దసరా బరిలో దిగేటప్పుడు సినిమాను స్టూడియో లోనే స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవాలి అని మిగతా దర్శకులకి నేర్పించే సినిమా ఇది.

మొత్తానికి ఈ దసరాకి మెప్పించే ప్రయత్నంలో రవితేజ కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.

ఒక్క మాటలో – వట్టి నాగేశ్వర్ రావు

Also Read This : అధికార దుర్వినియోగం చేస్తున్న పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.