రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్‌….

APJ Abdul Kalam :

కలలు కందాం రండి అంటున్న అమీర్‌ఖాన్‌……

ప్రపంచంలోని గొప్పవారి కథలన్నీ బయోపిక్‌ల రూపంలో తెరముందుకు తీసుకొచ్చి 70యం.యం స్క్రీన్‌ని మురిపిస్తున్నాయి.

అలాంటి గొప్ప గొప్ప కథలను అందించటానికి స్టార్స్‌ నడుం బిగిస్తున్నారు.

భారతదేశం మొత్తం ఈ స్లోగన్‌ని ఇష్టపడుతుంది. దానికి కారణం భారత మిస్సైల్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఏ.పి.జె అబ్దుల్‌ కలాం చెప్పిన ‘కలలు కనండి వాటిని నేరవేర్చుకొండి…’

అని ఆయన నోటినుండి వచ్చిన ఈ స్లోగన్‌ చాలా ఫేమస్‌.

ప్రస్తుతం ఆయన బయోపిక్‌ బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వార్‌ నిర్మిస్తున్నారు.

2025 అక్టోబర్‌ 25న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఈ మధ్యే విడుదలైంది.

ట్రైలర్‌లో అమీర్‌ఖాన్‌ నిజమైన కలాంలా కనిపించారు.

ట్రైలర్‌లో సముద్రం ఒడ్డున పుట్టి పెరిగిన ఓ కుర్రాడు ఆకాశంలోని నక్షత్రాలను చూసి కలలు కన్నాడు.

ఆకలికి, పేదరికానికి మధ్యలో తన బాల్యం గడిచింది. అతనే తర్వాత కాలంలో భారతదేశం గర్వించే సైంటిస్ట్‌గా మారాడు.

మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి కెక్కారు.

అక్కడనుండి భారత ప్రధమ పౌరునిగా తన ప్రయాణం…

అనితర సాధ్యమైన తన ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటానికి బాలీవుడ్‌ స్టార్‌ ఆర్టిస్ట్‌ అమీర్‌ఖాన్‌ ప్రేక్షకులముందుకు రానున్నారు.

ట్రైలర్‌లో ఉన్న కొద్దిపాటి ఇన్‌ఫర్‌మేషన్‌కే ఆ టీమ్‌పై గౌరవం ఏర్పడింది అంటున్నారు నెటిజనులు.

ఆ సినిమా కోసం మరో ఆరు నెలలు వెయిట్‌ చేయాల్సిందే….వెయిటింగ్‌ ఫర్‌ యూ ఎ.పి.జే అబ్దుల్‌ కలాం……

శివమల్లాల

Also Read This : రాజీవ్‌కి రూ.360 కోట్ల అప్పు.. సుమ రియాక్షన్‌తో గుండె ఆగినంత పనైంది: హర్షవర్థన్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *