ఓ తెలుగు సినిమా హిట్టా ? ఫట్టా? తెలియాలంటే ఇప్పుడైతే ఫోన్ పట్టుకుంటే సరిపోతుంది.
ఓ నలభై ఏళ్ల క్రితం అయితే ఆ సినిమా విజయవాడ ప్రేక్షకులకు నచ్చితే సినిమా హిట్టు…లేదంటే ఫట్టు…ఇది ఆ రోజుల్లో సినిమా ట్రెండ్.
అలాంటి ట్రెండ్‌లో సినిమాలు చూస్తూ పెరిగి పెద్దదైన తర్వాత ‘గ్రహణం’ వంటి నెగిటివ్ టైటిల్‌పెట్టి సినిమాను ఎంతో పాజిటివ్‌గా తీసిన దర్శకుడితడు.
కట్‌చేస్తే జాతీయ అవార్డు అందుకున్న ఆ దర్శకుణ్ని చూసి ముచ్చటపడింది తెలుగు చిత్ర పరిశ్రమ.
అతనే ఇంద్రగంటి మోహనకృష్ణ. అతని సినిమాలు హాయిగా ఉంటాయి.
ఫ్యామిలీ అంతా చాపేసుకుని హాల్లో కూర్చుని చూసేంత ప్రశాతంగా ఉంటాయి.
పెద్దగా హడావిడి ఉండదు. మంచి కథను హృద్యంగా చెప్పాలనుకుంటారు.
అందుకే తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఏప్రిల్ 17 ఆయన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 18 ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘సారంగపాణి జాతకం’ విడుదల అవుతుంది.
ఫ్యామిలీ అంతా రండి…ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను అంటూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ప్రామిస్ చేశారు ఇంద్రగంటి.
ఆయన తన చిన్ననాటి అనుభవాలు, పెళ్లికాకముందు వాళ్లవిడ ఉమాతో సినిమాకి వెళ్లిన సందర్భాలు ఇలా ఒకటేమిటి…బోలేడు విషయాలు చెప్పారు.
తీరిగ్గా ఉన్నప్పుడు చూసేయండి…ఇంటర్వూ బై శివమల్లాల
