Parliament Elections : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టిన జోష్ లో ఉన్న
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీగా కాంగ్రెస్ కు
విజయావకాశఆలు ఎక్కవగా ఉంటాయన్న అంచనాతో చాలా మంది ఆ పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..
రాష్ట్రంలో మొత్తం 17 పార్లెమెంటు స్థానాలుండగా.. వాటిలో 16 స్థానాలకు పెద్ద ఎత్తున టికెట్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి.
ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నకల్తో కాంగ్రెస్ పూర్తిసాయిలో ఆదిపత్యం చూపిన ప్రాంతాల్లోని స్థానాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
వీటిలో భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీచేసేందుకు అవకాశం కోరుతూ పెద్దసంఖ్యలో నేతలు దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ సీటు కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత
సన్నిహితంగా ఉన్న నేతగా పేరుంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్నఅలియాస్
చింతపండు నవీన్ కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు.
అయితే భువనగిరి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. బీసీల ఓట్లు కలిసివస్తాయని అంచనా వేసుకుంటున్నారు.Parliament Elections
ఇక మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్నా కైలాస్ నేత కూడా భువనగిరి టికెట్ కోసం దరఖాస్తు చేశారు.
చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ పోటీ చేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదని….
బీసీ సామాజికవర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని హైకమాండ్ ను కోరుతున్నారు.
వీరే కాకుండా కోమటిరాజగోపాల్ రెడ్డి సతీమణిని కూడా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఒక్క జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. దీంతో ఇక్కడ్నుంచి టికెట్ దక్కితే సులభంగా విజయం
సాధించవచ్చని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ టికెట్ ఖరారు విషయంలో మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయం
కీలకం కాబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
2009 పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ్నుంచి విజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలిచారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసి…. విక్టరీ కొట్టారు.
ఈ నేపథ్యంలో మరోసారి తమ కుటుంబం నుంచే భువనగిరి అభ్యర్థి ఉండాలన్న ఆలోచన కూడా
కోమటిరెడ్డి సోదరులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి సతీమణిని ఇక్కడినుంచి బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Also Read:poonam panday news : బతికే ఉన్నానంటూ వీడియో షేర్ చేసిన నటి
