ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా సక్సెస్ అయిన వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు.
‘హృదయ కాలేయం’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై సంపూగానూ.. బర్నింగ్ స్టార్‌గానూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.
సాయి రాజేశ్ రూపొందించిన ఈ సినిమా 11 ఏళ్ల కిందట విడుదలైంది.
ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే సంపూ మాట్లాడుతూ.. సినిమా అనే చాలా మందికి ఒక కల అని.. దానిని సాకారం చేసుకునేందుకు వందల మంది యత్నిస్తుంటారని పేర్కొన్నాడు.
తనకు ఈ అవకాశం, గుర్తింపు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపాడు.
నరసింహా చారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన తనను దర్శకుడు సాయి రాజేశ్ ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేష్ బాబుగా మార్చారని..
ఆయనకు రుణపడి ఉంటానన్నాడు.
‘హృదయ కాలేయం’ సినిమా విడుదల టైమ్‌లో దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్‌తో తనకు చాలా గుర్తింపు లభించిందని..
ఎప్పుడు కలిసినా ఆయన తనను చక్కగా పలకరిస్తుంటారని వెల్లడించారు.
‘హృదయ కాలేయం’ టైమ్‌లో హీరో సందీప్ కిషన్, దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ ఎంతో సపోర్ట్ చేశారన్నారు.
ఈ 11 ఏళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించానని.. త్వరలో ‘సోదరా’ అనే మూవీతో మీ ముందుకు రాబోతున్నానని సంపూ తెలిపాడు.
ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్‌కు కానుందని.. ఇది కాకుండా మరో రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయన్నారు.
తన సంపాదనలో కొంత ఛారిటీకి ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని సంపూర్ణేష్ బాబు వెల్లడించాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘మ్యాడ్ స్క్వేర్’ దర్శకుడు ఎన్టీఆర్ కాళ్లకు దణ్ణం పెట్టబోగా ఆయన ఏం చేశారంటే..