పవన్ టైటిల్ అని కాదు.. సినిమాకు యాప్ట్ అవుతుందని తీసుకున్నాం: నితిన్, భరత్

ఇద్దరు ఎలక్ట్రానిక్ ఇంజినీర్లు.. కిర్లోస్కర్ కంపెనీలో పని చేసేవారు.. ఇద్దరూ ఇంట్రావర్ట్స్.. ఒకచోట కూర్చొని పని చేయడం నచ్చదు.. కోడింగ్‌లో దిట్టలు.. అలా ఉద్యోగంలోనే కొనసాగితే ఎలా ఉండేదో కానీ ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది కదా.. అలా బుల్లితెరపై అడుగు పెట్టారు. ఆ తరువాత వెండితెరపై దర్శకులుగా అడుగు పెట్టారు. వారు మరెవరో కాదు.. నితిన్, భరత్. బుల్లితెర ప్రేక్షకులకు ఈ వ్యక్తుల ముఖ పరిచయం లేకపోవచ్చేమో కానీ పేర్లు మాత్రం బాగా తెలిసినవే. ప్రదీప్ మాచిరాజు హీరోగా పవన్ కల్యాణ్ ఫస్ట్ సినిమా టైటిల్ ‘అక్కడ అమ్మాయి… ఇక్కడ అబ్బాయి’ సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు ఈ నెల 11న థియేటర్లలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో నితిన్, భరత్‌లు విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మేము టెలివిజన్‌లో చాలా షోస్ చేశాం. అప్పటి నుంచి ప్రదీప్ మాకు పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివరిలో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి రావడంతో అది మాకు ఎక్సయిటింగ్ గా అనిపించింది. ప్రదీప్ గారితో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒకసారి ఈ ఐడియా చెప్పాము. బావుందన్నారు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నరేషన్ ఇచ్చాం. ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా టైటిల్ అని తీసుకోలేదు. సినిమాకు యాప్ట్ అవుతుంది కాబట్టి తీసుకున్నాం. పబ్లిసిటీ పరంగా కూడా ఇది ప్లస్ అవుతుంది. అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీశాం. టీవీ నుంచి సినిమాలకి రావడమనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్. ఫిక్షన్ కి నాన్ ఫిక్షన్ కి చాలా తేడా ఉంటుంది. మేము ఫిక్షన్‌కి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కూడా పనిచేయలేదు. నాన్ ఫిక్షన్‌లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. కానీ సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు. అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డీఓపీ బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ రదన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్‌తో సినిమాని అద్భుతంగా చేశాం. బుల్లితెరపై చేసిన ప్రతి స్కిట్ ఒక కథ. అయితే సినిమా కొంచెం పెద్ద కథ. ఇందులో కామెడీతో పాటు బ్రహ్మానందం గారు. సత్య గారు పాత్రలన్నీ కథలో ఆర్గానిక్‌గా ఉంటాయి. ఆ పాత్రలని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ విషయానికి వస్తే ఒక తెలుగు అమ్మాయితో ఈ క్యారెక్టర్‌ని చేయించాలనుకున్నాం. దానికి తగ్గట్టే ఆడిషన్ చేశాం. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ వారే ఫస్ట్ ఆడియన్స్. వారికి సినిమా బాగా నచ్చింది. సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందని చెప్పారు. ఇది సమ్మర్ కి రావాల్సింది సినిమా అని వారే రిలీజ్ డేట్ ఆలోచించి ఫిక్స్ చేశారు. వారే మా ఫస్ట్ ఆడియన్స్. వారి రియాక్షన్ చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రథన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో మంచి డ్యాన్స్ నంబర్స్ ఉన్నాయి.

ప్రజావాణి చీదిరాల

Also Read This :గులాబి ఏనుగు నుండి ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *