సినిమా కష్టాల గురించి వింటూనే ఉంటాం. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో అవకాశం సంపాదించడమంటే సాధారణ విషయం కాదు.
అవకాశం సంపాదించినా కూడా ఆ సినిమా హిట్ అయితేనే లైఫ్. లేదంటే ఇంటి బాట పట్టాల్సిందే.
అయితే ఓ వ్యక్తి మాత్రం అలా వెనుకడుగు వేయలేదు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెదుకున్నాడు.
అతను మరెవరో కాదు.. హీరో హర్షవర్థన్ రాణే. సినిమాలపై ఆశతో రూ.200 తీసుకుని ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు.
తాజాగా అతను ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఇల్లు వదిలి వచ్చేశాక ఎన్ని కష్టాలు పడ్డాడో వివరించాడు.
ఇంటి నుంచి వచ్చేశాక కడుపు నింపుకోవడం కోసం ఎన్నో ఉద్యోగాలు చేశానని వెల్లడించాడు.
చివరకు హోటల్‌లో క్లీనర్‌గా, డెలివరీ బాయ్‌గా.. చివరకు వడ్రంగి పని కూడా చేశాడట.
ఎట్టకేలకు హర్షవర్థన్ రాణే ప్రయత్నాలు ఫలించి ‘తకిట తకిట’ సినిమాతో హీరో అయితే అవగలిగాడు కానీ అది కాస్తా డిజాస్టర్ అవడంతో తిరిగి కష్టాలు ప్రారంభమయ్యాయి.
అనంతరం బాలీవుడ్‌లో ఆడిషన్స్ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించినా ప్రయోజనం శూన్యం.
హర్షవర్థన్ రాణే తను నటించిన ‘సనమ్ తేరి కసమ్’పై గంపెడాశలు పెట్టుకున్నాడు కానీ అది కూడా నిలబడలేదు.
కానీ ఎక్కడో అతడికి కాస్త అదృష్టం ఉన్నట్టుంది. ఈ సినిమా రీరిలీజ్‌లో మంచి సక్సెస్ సాధించింది. అంతే.. అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి.
హీరోగా అతనికి మంచి టైమ్ వచ్చింది. ప్రస్తుతం ‘దీవానియత్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : నా పాత్రకు వేణు స్వామి ప్రేరణ కాదు
